Seven medals for Telangana in 300 people

తెలంగాణలో 300 మందికి సేవా పతకాలు

Date: 02/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

హైదరాబాద్నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో మెరుగైన ప్రతిభ కనబరిచిన అధికారులు,సిబ్బందికి గుర్తింపునిస్తూ వివిధశాఖలకు చెందిన దాదాపు 300 మందికి సేవా పతకాలను ప్రకటించింది. అందులో పోలీసు, అగ్నిమాపక, ఎస్పీఎఫ్‌, అనిశా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది ఉన్నారు. విధి నిర్వహణలో మెరుగైన ప్రతిభ కనబరిచిన అధికారులు,సిబ్బందికి గుర్తింపునిస్తూ ప్రభుత్వం ఈ పతకాలును ప్రకటించింది. పోలీసు శాఖలో నలుగురికి ముఖ్యమంత్రి సేవా పతకాలు, 11 మందికి శౌర్య సేవా పతకాలు, 37 మందికి మహోన్నత సేవాపతకాలు, 21 మందికి కఠిన సేవా పతకాలు, 165 మందికి సేవా పతకాలు ప్రకటించింది. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ నుంచి ఒకరికి మహోన్నత సేవాపతకం, ముగ్గురికి ఉత్తమ సేవా పతకాలు, 15 మందికి సేవా పతకాలు ప్రకటించింది. అగ్నిమాపక శాఖలో ఆరుగురికి శౌర్య సేవాపతకాలు, ఒకరికి ఉత్తమ సేవా పతకం, 14 మంది సేవా పతకాలకు ఎంపికయ్యారు. అవినీతి నిరోధకశాఖలో ముగ్గురిని ఉత్తమ సేవా పతకాలు, 12 మందిని సేవా పతకాలు వరించాయి. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో ఇద్దరు సేవా పతకాలకు ఎంపికయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న పతకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు.

Tag: Seven medals for Telangana in 300 people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *