గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహారాజ్

– ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
 
కడ్తల్ ముచ్చట్లు:
 
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి  అన్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండల కేంద్రాలలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. కడ్తాల్, అమనగల్, తలకొండపల్లి మండల కేంద్రాలలో గిరిజనులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని నృత్యం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ  మాట్లాడుతూ గిరిజనుల కోసం సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలను కొనియాడారు.
 
Tags; Sewalal Maharaj is a tribal deity

Natyam ad