మళ్లీ శశికళ కలకలం

చెన్నై ముచ్చట్లు:
 
అన్నా డిఎంకేలో మళ్ళీ అగ్గి రాజుకుంది. పార్టీలోని ఒక వర్గం, పార్టీ బహిష్కృత నాయకురాలు, తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి  శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరడంతో, పార్టీలో వెనకటి విభేదాలు మరో మరు భగ్గుమన్నాయి. నిజానికి శశికళ ఇంచు మించుగా గత ఆరేడు నెలలుగా, పార్టీ పగ్గాలు తమ  గుప్పిట్లోకి తీసుకునేందుకు, తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక్కప్పుడు పార్టీని బతికించడం కోసం, శశికళ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జరిగింది. ఎవరో ప్రచారం చేయడం కాదు, ఆమె స్వయంగా ఫోన్ సంభాషణలు రిలీజ్, చేసి వచ్చేస్తున్న .. అంటూ ప్రచారం చేసుకున్నారు. అయితే కొద్ది రోజులకే ఆ ప్రచారం ముగిసింది. అయితే, శశికళ మాత్రం అప్పుడప్పుడు తమ ఉనికిని గుర్తు చేస్తూనే ఉన్నారు. రాజకీయ తెర మీదకు వచ్చి పోతూనే ఉన్నారు. కనిపిస్తూనే ఉన్నారు. అయితే, శశికళ ఎప్పుడు తెర మీదకు వచ్చినా అదొక వివాదంగానే ముగుస్తోంది. కాగా తాజాగా  పార్టీ అగ్రనేత పన్నీర్ సెల్వం సోదరుడు రాజా శశికళ కారణం చిక్కుల్లో చిక్కుకున్నారు. శశికళతో పార్టీ వ్యవహారాలపై ఆయన చర్చలు జరపడంతో పార్టీ ఆయనపై  బహిష్కరణ వేటు వేసింది. తాజాగా, ఆమె మార్చి 4న రాష్ట్రంలోని దక్షిణప్రాంత పర్యటన చేపట్టారు. అందులో భాగంగా తన మద్దతుదారులను కలుసుకుంటున్నారు. తిరుచెండూర్లో శశికళను కలిసిన రాజా.. ఆమెతో పార్టీ వ్యవహారాలపై చర్చించారు.
 
 
 
దీంతో, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన సహా నియమాలకు విరుద్ధంగా పనిచేయడం వంటి కారణాలతో రాజాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు ఏఐఏడీఎంకే సమన్వయకర్త పన్నీర్సెల్వం, కోఆర్డినేటర్ కే పళనిస్వామి సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంలో మరో ముగ్గరిని సస్పెండ్ చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితులలో పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం తెచ్చేందుకు, శశికళని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని పార్టీలో ఒక వర్గం గట్టిగా కోరుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి ఉహించిందే అయినా, పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన డిఎంకే అధ్యక్షడు, ముఖ్యమంత్రి స్టాలిన్ తమ దైన పంథాలో దూసుకు పోతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నా డిఎంకే అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఓట్లను కుడా నిలుపుకోలేక్ పోయింది. ఈ   నేపధ్యంలో, ఆయన్ని స్టాలిన్’ ను  సమర్ధ వంతంగా ఎదుర్కోవాలంటే శశికళ వర్గాన్ని పార్టీలోకి తీసుకోక తప్పదని, పార్టీలోని ఆమె అనుకూల వర్గం ప్రచారం మొదలు పెట్టింది. అందులో భాగంగానే  శశికళ పర్యటన ప్రారంభించారు. ఇప్పుడు  అదే చిలికి చిలికి గాలివానగా మారిందని, అయితే, ఎప్పుడో అప్పుడు అన్నా డిఎంకే పగ్గాలు శశికళ చేతికి చేరడం ఖాయమని అంటున్నారు.
 
Tags: Shashikala kalakalam again

Natyam ad