Natyam ad

షీ షటిల్ సర్వీస్ ప్రారంభం

హైదరాబాద్  ముచ్చట్లు:
కోవిడ్ సమయంలో లో మహిళలు ఓవైపు ఇంటి పని మరోవైపు కార్యాలయం విధులను నిర్వహిస్తూ అనేక సవాళ్లను ఎదుర్కొంటూ క్లిష్టమైన పరిస్థితులను అధిగమించడం జరిగిందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.  సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ (SCSC) ఆధ్వర్యంలో మాదాపూర్ హెచ్ఐసిసి లో ఏర్పాటు చేసిన షీ షటిల్ సర్వీస్ ను తెలంగాణ రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమీషనర్ దివ్యా దేవరాజ్, ఏసీబీ డైరెక్టర్ షికా గోయల్, డీసీపీ లు అనసూయ, శిల్పవళ్ళి, ఇందిరా, SCSC సెక్రటరీ కృష్ణ ఏదుల తో కలసి ప్రారంభించారు..
ఈ సందర్భంగా సిపి  మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలో 48 శాతం మహిళా పోలీసు సిబ్బందికి కరోన సోకినట్లు ఆయన తెలిపారు. కరోనా సోకినప్పటికి కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో వారికి పోస్టింగ్లు వేయడం జరిగిందని అన్నారు. కరోనాకు భయపడకుండా తమ విధులను సక్రమంగా నిర్వహించి ముందుండి ఎదుర్కొన్న మహిళా అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.  మహమ్మారి అనంతరం కూడా మహిళలు మనోధైర్యాన్ని కోల్పోకుండా బాధ్యతగా ఒకే సమయంలో పలు పనులను చేసి చూపడం జరిగిందని అన్నారు. భారతదేశంలో మహిళలు ఎంతో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటూ స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని, మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించు కోవాలని ఇంట్లో, కార్యాలయాల్లో మహిళలు పనులను సజావుగా చూసేలా వాతావరణాన్ని అందించాలని తెలియజేశారు.
 
Tags:She Shuttle Service Launch