శివ దీక్ష మాల.

అజ్ఞానం నుండి జ్ఞానం లోకి.
చెడు మార్గం నుండి మంచి మార్గంలోకి
అత్యంత కఠిన నియమాలతో శివ దీక్ష భక్తుల సన్మార్గమే మోక్షంగా మాలాధారణ
 
మంత్రాలయం ముచ్చట్లు:
 
 
ప్రజలు చెడు మార్గంలో ప్రయాణించేటప్పుడు మంచి మార్గంలోకి అజ్ఞానం నుండి జ్ఞాన వంతులుగా మారడానికి , దుర్మార్గాన్ని వదిలి సన్మార్గాన్ని పొందడానికి ,శివ సాక్షాత్కారాన్ని పొందడానికి ,శివానుగ్రహాన్ని పొందడానికి ఈ శివ దీక్ష మాలను  భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ధరిస్తారు. చెడు మార్గంలో ప్రయాణించే వాళ్ళు చెడు అలవాట్లు  ఉన్న వాళ్ళు మంచి మార్గంలో నడవడానికి, అజ్ఞానం నుండి  జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, జ్ఞానవంతులు సన్మార్గాన్ని పొందడానికి ఈ  శివదీక్షను  స్వీకరిస్తారు. అత్యంత కఠిన నియమాలతో ఈ శివ దీక్ష 41 రోజులు ధరించాలి. 12 సంవత్సరాలు శివ మాల ధరించిన వారు గురు స్వాములుగా  ప్రసిద్ధి చెందినారు గురు స్వాములు సమక్షంలో శివ మాలను  ధరించాలి. శివ దీక్ష మాల స్వీకరణకు కాషాయ వస్త్రాలు మాత్రమే ధరించాలి .కాషాయం అంగి కాషాయ లుంగి కాషాయ టవలు మెడలో రుద్రాక్ష మాలలు ధరించి గురుస్వామి ఆధ్వర్యంలో శివ దీక్ష స్వీకరిస్తారు. ప్రతిరోజూ మూడు పూటలా స్నానం ,మూడు పూటల పూజ , ఒంటిపూట భోజనం లాంటి నియమ నిబంధనలు పాటించాలి. మహిళలను తాకరాదు. ఇంటికి వెళ్ళరాదు, వెళ్లిన అప్పటి నుంచే బయటకు రావాలి. శివాలయంలో కానీ లేదా ఏదైనా ఆలయంలో కానీ బస చేయాలి. ఉదయము పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి మధ్యాహ్నం మాత్రమే ఒంటిపూట భోజనం మాత్రమే చేయాలి. రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి. నిత్యం 41 రోజులు కచ్చితంగా 41 రోజుల దీక్ష పాటించాలి .చివరి రోజు ఆ బోలా శంకరుడు కైలాసవాసీ శివ సన్నిధికి చేరుకుని ముడుపులు చెల్లించి పని స్వామిని దర్శించుకొని శివ దీక్ష విరమించాలి .శివ దీక్షాపరులు కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు. అక్కడ ఆ శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక దేవి దర్శనం చేసుకుని అక్కడే నిద్రిస్తారు. శివరాత్రి రోజు అయితే శివ క్షేత్రాలలో జాగరణ చేస్తూ శివ భక్తి పాటలతో  శివ స్వాములు జాగరణ చేస్తారు. అనంతరం స్వగ్రామానికి చేరుకొని గురు దీక్షను  గురుస్వాముల ఆధ్వర్యంలో విప్పుతారు. ఈ శివ మాల దీక్ష స్వీకరించిన 41 రోజులు ఎటువంటి చెడు అలవాట్లు జోలికి వెళ్ళకూడదు .
 
 
 
చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండడానికి అజ్ఞానం నుండి జ్ఞాన వంతులుగా రూపాంతరం చెందడానికి శివ సన్నిధికి చేరుకోవడానికి శివతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ నలభై ఒక్క రోజుల దీక్ష మండలి భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతోందని  ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త ,వాస్తు శాస్త్ర సంపన్నులు జంగమ.  రుద్రయ్య  స్వామి పేర్కొన్నారు. చాలా మంది భక్తులు శివ మాల ధరించిన తర్వాత ఎటువంటి చెడు అలవాట్లకు లోనుకాకుండా ఉండటం చాలా విశేషం. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా అలాగే చాలామంది శివ దీక్ష అయిన తర్వాత చెడు అలవాట్లకు దూరంగా ఉండి జ్ఞానవంతులు సంపూర్ణ మానవత్వం గల మనుషులుగా మంచి చెడు తెలిసినవారి గా వారు మారతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే జ్ఞానసముపార్జన కోసం ప్రజలు భక్తులు ఈ నలభై ఒక్క రోజుల దీక్ష స్వీకరించి సన్మార్గంలో నడుస్తారు. శివరాత్రి ముందు శివరాత్రికి తరువాత ఉగాది వరకు ఆంధ్రా కర్ణాటకలోని లక్షలాది మంది భక్తులు శివ మాల ధరించి కొన్ని వందల వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ శివ స్మరణ చేసుకుంటూ ఓం నమశ్శివాయ అంటూ  పంచాక్షరి నామం జపిస్తూ  శ్రీశైలంలోని శివపార్వతుల సన్నిధికి చేరుకుని మోక్షాన్ని ప్రసాదించమని వేడుకుంటారు. శ్రీశైలంలో ఆలయ అధికారులు శివరాత్రికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. అలాగే శివ మాల ధరించిన  శివ స్వాముల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తారు.ధర్శనానికి  ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఎటువంటి ఆటంకం కలగకుండా వెంకటాపురం నుండి శ్రీశైలం వరకు 40 కిలోమీటర్ల వరకు మద్యలో భోజన సౌకర్యం ,మంచినీటి సౌకర్యాన్ని ప్రజలు స్వాములకు కాలినడకన వచ్చే భక్తులకు అందిస్తారు. అలాగే చాలా గ్రామాలలో పాదయాత్ర గా వస్తున్న భక్తుల కోసం అన్నదానాలు మంచినీటి సదుపాయాలు కల్పించి తమ భక్తిని చాటుకుంటున్నారు ప్రజలు. శివ స్వాములకు అన్నదానం చేసిన మంచి నీరు అందించిన సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులకు ప్రసాదం పెట్టినంత ఆనందంగా ఉంటుంది అంటారు భక్తులు
 
Tags:Shiva Deeksha Mala.

Natyam ad