విశాఖ సాగరతీరంలో శివరాత్రి పూజలు

విశాఖపట్నం ముచ్చట్లు:
 
మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మహాశువుడ్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.ప్రతీ ఏటా వైభవంగా మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా సుబ్బరామిరెడ్డి పూజలు ఈ సారి కూడా వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు హాజరై అభిషేకం నిర్వహించారు.ఆర్కేబీచ్ వద్ద ఏర్పాటు చేసిన కోటి లింగాల నమూనా శివభక్తులను ఆకర్షిస్తోంది.శివలింగానికి కుంభాభిషేకంలో పాల్గోనేందుకు తరలి వచ్చిన భక్తులతో సాగరతీరం శివనామస్మరణతో మార్మోగింది.మరోవైపు మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులతో శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
Tags: Shivratri pujas on the Visakhapatnam beach

Natyam ad