Shock: Urooboda Sarpach Narra Sujatha resigns to TDP

షాక్: టిడిపికి ఉరవకొండ సర్పంచ్ నర్రా సుజాత రాజీనామా

Date : 29/12/2017

అనంతపురం ముచ్చట్లు:

ఉరవకొండ సర్పంచ్ నర్రా సుజాత, ఆమె భర్త నర్రా కేశన్న టిడిపికి రాజీనామా చేశారు. తమపై మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సోదరుల వద్ద కొందరు చేరి తమను పార్టీకి దూరం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పార్టీ కోసం పనిచేసినట్టు చెప్పారు.గురువారం నాడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలను పార్టీ కార్యాలయానికి పంపారు. 20 సంవత్సరాలుగా టీడీపీలో క్రమశిక్షణతో పని చేశామన్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఎన్ఎస్ఎఫ్కు అండగా ఉండడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడామన్నారు. తమపై కేసులు బనాయించారని వారు గుర్తు చేశారు.వాస్తవాలు పయ్యావుల సోదరులకు తెలియకుండా వ్యవహరిస్తున్నారని నర్రా సుజాత ఆరోపించారు.ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో కూడ తమను పాల్గొనకుండా అడ్డుకొన్నారని ఆమె ఆరోపించారు.కొందరు వ్యక్తులు తమను పార్టీకి దూరం చేయడమే లక్ష్యంగా పని చేయడం బాధాకరమన్నారు. దీంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

Tags : Shock: Urooboda Sarpach Narra Sujatha resigns to TDP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *