కర్ణంగుడాలో కాల్పుల కలకలం.

రంగారెడ్డి ముచ్చట్లు:
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడా లో కాల్పులు  కలకలం  రేపాయి. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. కర్ణంగుడా గ్రామ సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రఘుకి గాయాలయ్యాయి. మృతుడి ఛాతి లోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి.  కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. తనపై తుపాకితో కాల్పులు జరిపారనిస్థానికులకు  రియల్టరు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడున్న స్కార్పియో కారుకు రక్తం మరకలు వున్నాయని పోలీసులు గుర్తించారు. ఇటీవల ఇబ్రహీంపట్నంలో భూమి కొనుగోలు చేసిన శ్రీనివాస్ రెడ్డి తన  భూమి వద్దకు పోయి వస్తుండగా ప్రత్యర్థులు కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులకు భూ వివాదమే కారణంగా తేల్చారు.ఇటీవల 10ఎకరాలు శ్రీనివాస్ రెడ్డి,రాఘవేందర్ రెడ్డి లు ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసారు. ఆదే భూమిలో  మట్టారెడ్డి అనే వ్యక్తి కబ్జాలో వున్నాడు. మట్టారెడ్డి తో వాగ్వాదం తర్వాత కాసేపటికేకాల్పులు జరిగాయి.
 
Tags:Shooting commotion in Karnanguda

Natyam ad