ఎస్వీ సంగీత క‌ళాశాల‌లో ఘ‌నంగా శ్రీ భ‌ద్రాచ‌ల రామ‌దాసు జ‌యంతి

తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర సంగీత, నృత్య క‌ళాశాల‌లో శ్రీ భ‌ద్రాచ‌ల రామ‌దాసు జ‌యంతిని శుక్ర‌వారం ఘనంగా నిర్వహించారు. అధ్యాప‌కులు, విద్యార్థులు క‌లిసి శ్రీ‌రామ‌దాసు కీర్త‌న‌ల‌ బృంద‌గానం, రామ‌నామావ‌ళిని ఆలపించారు.ఈ సందర్భంగా ఉదయం కళాశాల ప్రాంగణంలోని శ్రీ భ‌ద్రాచ‌ల రామ‌దాసు విగ్ర‌హానికి పూజ‌, పుష్పాంజ‌లి ఘటించారు. ఆ తరువాత రామదాసు విగ్రహం ఎదుట అధ్యాప‌కులు, విద్యార్థులు క‌లిసి శ్రీ‌రామ‌దాసు రామ‌నామావ‌ళిని గానం చేశారు. కళాశాలలోని సీతా లక్ష్మణ శ్రీరాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాముల విగ్రహం ఎదుట అధ్యాప‌కులు, విద్యార్థులు క‌లిసి రామదాసు రచించిన పలుకే బంగారమాయెనా… త‌దిత‌ర కీర్తనలను బృంద‌గానం చేశారు. ఈ సంద‌ర్భంగా రామ‌దాసు జీవిత విశేషాల‌ను పండితులు విద్యార్థులకు తెలియజేశారు.ఎస్వీ సంగీత, నృత్య‌ క‌ళాశాల ప్రిన్సిపాల్  ఎం.సుధాక‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో అధ్యాప‌కులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
 
Tags: Shri Bhadrachala Ramadasu Jayanti celebrated at SV College of Music

Natyam ad