Silver prices are rising

పెరిగిన పసిడి.. వెండి ధరలు

Date: 20/12/2017
దిల్లీ ముచ్చట్లు:
వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మరోసారి పెరిగింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో పది గ్రాముల బంగారం ధర రూ.175 పెరిగి రూ.29,700కి చేరింది. బంగారం కొనుగోళ్లపై స్థానిక ఆభరణాల తయారీదారులు ఆసక్తి చూపడం, అంతర్జాతీయ పరిస్థితులు సానుకూలంగా ఉండటం బంగారం ధర పెరుగుదలపై ప్రభావం చూపాయని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పసిడి బాటలోనే వెండి పయనించింది. రూ.150 పెరిగి.. కిలో వెండి ధర రూ.38,250కి చేరింది. నాణెల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ వూపందుకోవడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా పసిడి ధర 0.18శాతం పెరిగి ఔన్సు 1,264.20 డాలర్లు పలికింది. వెండి 0.15శాతం పెరిగి ఔన్సు 16.16 డాలర్లు పలికింది.
Tag:Silver prices are rising

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *