కబ్జా కోరల్లో సింగరేణీ  భూములు

అదిలాబాద్ ముచ్చట్లు:
 
భూ మాఫియా అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కొందరు రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు. సింగరేణి సంస్థకు చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలు ఎక్కడికక్కడే కబ్జాలకు గురవుతున్నాయి.వివరాల్లోకి వెళితే.. సింగరేణి యాజమాన్యం చేపడుతున్న ఓసీపీ-5 విస్తరణ లో భాగంగా సింగరేణి తో పాటు ప్రభుత్వ అసైన్డ్ భూములను కొంతమంది కబ్జా చేసి మల్లి సింగరేణి కి విస్తరణ పేరుతో అమ్మి లాభాలను ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఓసీపీ-5 విస్తరణ కు సంబంధించిన భూములలో కొంత ప్రభుత్వ అసైన్డ్ భూములు ఉండగా.. మరికొంత సింగరేణి భూములు ఉన్నాయి. ఈ భూమిని 30 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేసినట్లు సమాచారం.అయితే ఈ భూములను రామగుండం మండలంలో పనిచేసిన ఓ రెవిన్యూ అధికారి సుమారు 3 సంవత్సరాల క్రితమే ఎకరాల కొద్దీ భూములను ఇతరులకు పట్టా చేసి లక్షల రూపాయలను చేతులు మర్చినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధికారి తెలివిగా భూములు ఇతరుల పేరుతో పట్టాలు చేసి బదిలీపై వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా ఓసీపీ-5 విస్తరణ లో భాగంగా ఈ భూములను మళ్లీ సింగరేణికే అప్పగించి లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. ఇందులో కొంతమంది అసలు లబ్దిదారులకు నష్టం వాటిల్లిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం గతంలోనే భూములు లేని వారికి ఓసీపీ-5 విస్తరణ పరిధిలో ఉన్న భూములను పంపిణీ చేసింది. అయితే లావా చట్ట ప్రకారం.. ఆ సమయంలో పంపిణీ చేసిన భూములను ఇతరులకు అమ్మ రాదు అనే నిబంధనతో పాటు ఎప్పుడైనా ప్రభుత్వానికీ అవసరం ఉంటే మళ్ళీ ప్రభుత్వానికే ఆ భూములను అప్పగించాలనే నిబంధనలు ఉన్నాయి.కానీ, వాటిని తుంగలో తొక్కి ఓ రెవెన్యూ అధికారి అక్రమ పట్టాలు చేసినట్లు పలువురు విమర్శిస్తున్నారు. గతంలో సైతం సదరు బదిలీపై వెళ్లిన ఓ రెవెన్యూ అధికారిపై ఎన్నో అవినీతి ఆరోపణల వార్తలొచ్చాయి. అయిన సంబంధించిన అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అనతికాలంలోనే కోట్ల రూపాయలకు సదరు ఓ రెవిన్యూ అధికారి పడగలెత్తడనే ప్రచారం సైతం జరుగుతోంది. ఈ భూములపై ప్రభుత్వం కానీ.. సింగరేణి యాజమాన్యం కానీ.. పూర్తి స్థాయిలో విచారణ చేపడితే భారీ మొత్తంలో భూ మాఫియా బాగోతాలు బయట పడతాయని పలువురు చర్చించుకుంటున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Singareni lands in occupied corals

Natyam ad