గాన కోకిల లతా మంగేష్కర్‌ కన్నుమూత 

ముంబై ముచ్చట్లు:
 
లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ (92) ఇక లేరు. ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో ఈ ఉదయం 8గం.12ని. తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. గత 29రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత నెల 8వ తేదీన కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆపై కరోనా నుంచి రికవరీ అయిన ఆమె.. వెంటిలేటర్‌పై కొన్నాళ్లు చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు ఈమధ్యే ప్రకటించారు కూడా. అయితే పరిస్థితి విషమించడంతో ఆమెకు మళ్లీ వెంటిలేటర్‌ మీదే చికిత్స అందించారు.
 
Tags: Singing cuckoo Lata Mangeshkar’s eyelid

Natyam ad