Six deaths in Dalit murder case

దళితుడి హత్య కేసులో ఆరుగురికి మరణశిక్ష

Date : 12/12/2017
తిరుపూర్ ముచ్చట్లు:
తమిళనాడులో శంకర్ అనే దళితుడి గత ఏడాది హత్యకు గురైయ్యాడు. ఆ కేసులో ఇవాళ తిరుపూర్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆ హత్య కేసులో మొత్తం ఆరుగురికి కోర్టు మరణశిక్షను విధించింది. బాధితుడి శంకర్ అత్తను మాత్రం కోర్టు నిర్దోషిగా వదిలిపెట్టింది. మొత్తం ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు. అందులో ఆరుగురికి మరణశిక్ష ఖరారు కాగా, ఒకరికి జీవితఖైదు వేశారు. మరొకరికి అయిదేళ్ల శిక్షను ఖరారు చేశారు. న్యాయమూర్తి అలమేలు నటరాజన్ ఈ తీర్పును ఇచ్చారు. 2016 మార్చి 13వ తేదీన ఉడుమల్పేట్ బస్స్టాండ్లో శంకర్ దంపతులపై హత్యాయత్నం జరిగింది. ఆ రోజు జరిగిన ఘటనలో దళిత యువకుడు శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
తీవ్రంగా గాయపడ్డ ఆయన భార్య కౌశల్య కొన్నాళ్లు హాస్పత్రిలో చికిత్స పొందింది. అయితే ఆ రోజున బస్స్టాండ్లో జరిగిన హత్య ఘటనకు సంబంధించిన వీడియో ఫూటేజ్ ఆ రాష్ట్రంలో వైరల్గా మారింది. దీంతో పోలీసులు ఆ కేసులో వెంటనే 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటనపై మొత్తం 1500 పేజీల రిపోర్ట్ను తయారు చేశారు.హిందూ మతానికి చెందిన కౌశల్యను శంకర్ అనే దళితుడు పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఆ అమ్మాయి తల్లితండ్రులు, ఇతరులతో కలిసి శంకర్పై దాడి చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం దీని కోసం స్పెషల్ ప్రాసిక్యూటర్ను కూడా నియమించింది. ఈ కేసు విచారణ నవంబర్లోనే పూర్తి అయ్యింది.ఇవాళ తుది తీర్పును వెల్లడించారు.
Tags : Six deaths in Dalit murder case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *