Sleep Health

ఆనం ఆరోగ్యం విషమం

Date:13/04/2018
నెల్లూరు ముచ్చట్లు:
టీడీపీ సీనియర్‌ నాయకుడు ఆనం వివేకనందారెడ్డి తీవ్ర అస్వస్థతతో కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఆనం పరిస్థితి తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కిమ్స్‌కు వచ్చి పరామర్శించారు. ఆయన వెంట మంత్రులు సోమిరెడ్డి, నారాయణ ఉన్నారు. ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.ల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆనం బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆనం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలియడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్స్ ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. వైద్యులను ఆనం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags: Sleep Health

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *