తల్లి, భార్యపై చిరు ప్రశంసలు…

హైదరాబాద్   ముచ్చట్లు:
సినీ ఇండస్ట్రీలో తాను హీరోగా నిలదొక్కుకోవడంలో తన సతీమణి సురేఖ అందించిన సహకారం మరవలేనిదని మెగాస్టార్‌ చిరంజీవి  తెలిపారు. ఇంట్లో బాధ్యతలన్నీ ఆమె తీసుకోవడం వల్లనే సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన భార్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మెగాస్టార్‌ . కాగా ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డేని పురస్కరించుకుని చిరంజీవి ఛారిట‌బుల్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. చిరంజీవి సతీమణి సురేఖ, సోదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ ప‌రిశ్రమకు చెందిన మ‌హిళా కార్మికుల‌కు చీర‌లు అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడిన చిరంజీవి తన తల్లి అంజనా దేవి, సతీమణి సురేఖలపై ప్రశంసల వర్షం కురిపించారు.అమ్మ వల్లే మహిళా పక్షపాతిగా మారాను.. ‘ఒక కుటుంబంలో మహిళలలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. చిన్నతనంలో నాకోసం అమ్మ ఎంతో కష్టపడ్డారు. ఆమె కారణంగానే నేను మహిళా ప‌క్షపాతిగా మారాను అని చెప్పాడు. ఇక నేను సక్సెస్‌ఫుల్‌ హీరోగా నిలవడానికి సురేఖనే ప్రధాన కారణం. ఇంట్లో నా బాధ్యతలన్నీ తనే తీసుకుంది. దీంతో సినిమాల‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాను. ప్రతి మ‌గాడి విజ‌యం వెనకాల ఒక మహిళ కచ్చితంగా ఉంటుందనడానికి సురేఖ మరో నిదర్శనం. ఈ మ‌హిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. మ‌హిళలు వంటింటికే ప‌రిమితం కాకుండా.. అంత‌రిక్షంలోనూ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఒలింపిక్స్‌ స్థాయికి ఎదుగుతున్నారు. మ‌హిళ‌ల సాధికారత కోసం అంద‌రూ కృషి చేయాలి. ప్రతి ఇంట్లో అమ్మ, సోదరి సాధికారత కోసం అందరూ పాటుపడాలి. ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శ‌క్తి ఉండాలి’ అని చిరంజీవి తెలిపారు.
 
Tags:Small compliments on mother and wife

Natyam ad