సాఫ్ట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు ముత్తుకూరు విద్యార్థిని షబ్రీన్ తాజ్ ఎంపిక

పెద్దపంజాణి ముచ్చట్లు :
మండల పరిధిలోని ముత్తుకూరు గ్రామానికి చెందిన ఎస్.షబ్రీన్ తాజ్ అనే 9వ తరగతి విద్యార్థిని జాతీయ స్థాయి సాప్ట్ బాల్ పోటీలకు ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.వెంకట్రమణ తెలిపారు. అండర్ – 14 బాలికల విభాగంలో నవంబర్ నెల 13,14,15 తేదీలలో అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి సాప్ట్ బాల్ పోటీలలో చిత్తూరు జిల్లా జట్టు తరపున తమ పాఠశాల విద్యార్థినిలు షబ్రీన్ తాజ్, మనీషాలు పాల్గొన్నారని ఆయన చెప్పారు. అనంతపురం, ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లా జట్లతో జరిగిన పోటీలలో షబ్రీన్ తాజ్ ఉత్తమ ప్రతిభ కనబరచి నాలుగో స్థానంలో నిలిచింది. ఇందుకు ఈ బాలికను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారని, నాగపూర్ లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో పా‌ల్గొంటుందని  ఆయన వివరించారు. విద్యార్థిని ఎంపిక పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,స్థానికులు హర్షం వ్యక్తం చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

Tag : Softball is a thief-pupil for national level competitions


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *