శ్రీకాళహస్తిలో ప్రజా సమస్యల పరిష్కారo

శ్రీకాళహస్తి  ముచ్చట్లు:
 
శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి   వినుత కోటా  ప్రారంభించిన KNOW MY CONSTITUENCY కార్యక్రమం లో భాగంగా  శ్రీకాళహస్తి పట్టణంలో బహదూర్ పేట పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క వీధి లైట్ కూడా వెయ్యలేదు , పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది, నిత్యావసర ధరలు, అర్హత ఉన్న కూడా కరెంటు చార్జీల స్లాబ్ పేరుతో రేషన్ కార్డ్, పెన్షన్ తొలగించారని, గాస్, విద్యుత్ ఛార్జీలు పెరిగి సామాన్యుడు జీవనం సాగించలేని పరిస్థితి అని ప్రజలు,మహిళలు వినుత గారికి తెలియజేశారు.సమస్యలను మునిసిపల్ కమిషనర్ కి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి ప్రజలకు న్యాయం జరిగేలా, సమస్యల పరిష్కారం కొరకు జనసేన పార్టీ పోరాడుతుందని వినుత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు భవాని శంకర్ , ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్ ,తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, నాయకులు మున్న, మణికంఠ,శివకుమార్ కావలి, కరీం, ప్రమోద్, నితీష్ కుమర్, చందు చౌదరి,తేజా,సురేష్, నగేష్, లక్ష్మణ్, గణేష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Solving public problems in Srikalahasti

Natyam ad