కల్పవృక్ష వాహనంపై సోమస్కందమూర్తి

తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమ‌వారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి కల్పవృక్ష వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహన సేవ ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ‌వాహ‌నంపై స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  సుబ్రమణ్యం, ఏఈవో  స‌త్రేనాయ‌క్ నాయక్, సూపరింటెండెంట్‌  భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.
 
Tags: Somaskandamoorthy on the Kalpavriksha vehicle

Natyam ad