ఫిబ్రవరి 18న విడుదలకు సిద్ధమైన ‘సన్ ఆఫ్ ఇండియా’

హైదరాబాద్ ముచ్చట్లు:
కలెక్షన్‌ కింగ్‌ డా. మంచు మోహన్‌బాబు హీరోగా డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్  బ్యానర్‌తో కలసి విష్ణు మంచు నిర్మించిన సంచలనాత్మక చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’.  చిత్రకథానాయకుడిగా డాక్టర్‌ మోహన్‌బాబు అదనంగా చిత్రానికి స్క్రీన్‌ప్లే బాధ్యతను కూడా నిర్వహించారు. ప్రముఖతారాగణమంతా ప్రధానపాత్రలను పోషించిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రం డాక్టర్‌ మోహన్‌బాబు మార్కు డైలాగులు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌, ఊహించని మలుపులతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్టు ఈ రోజు (2.2.2022) మోహన్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.  డా.మోహన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, ఫృథ్వీ రాజ్, రఘుబాబు, రాజా రవీంద్ర, రవిప్రకాష్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు.
 
Tags: ‘Son of India’ set to release on February 18

Natyam ad