మే నెలాఖరులోగా నైరుతి రుతుపవనాలు

Date:16/04/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోగా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ సందర్భంగా నైరుతి రుతుపవనాల ఆగమనంపై ఐఎండీ డీజీ రమేశ్ మీడియా సమావేశం నిర్వహించారు. తీరం తాకిన తర్వాత నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించడానికి 45రోజులు పడుతుందని ఆయన తెలిపారు. రెండో దశ రుతుపవనాల పరిస్థితిని జూన్‌లో పరిశీలిస్తామన్నారు. వరుసగా మూడో ఏడాది నైరుతి రుతుపవనాలు సాదారణంగానే ఉంటాయని రమేశ్ తెలిపారు. ప్రతి నెల రుతుపవనాల గమనాన్ని అంచనా వేసి.. వివరాలు అందిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
Tags:Southwest Monsoons in the month of May

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *