ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్
-సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మూడు తిప్పర్లు సీజ్, అన్యాక్రాంతం ఐన 49 ఎకరాలు స్వాధీనం…
రాజంపేట ముచ్చట్లు:
రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో.. భూ ఆక్రమణల తొలగింపునకు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగిందని సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా.. మొదటి రోజు.. రెవెన్యూ అధికారులతో కలిసి..రాజంపేట మండల పరిధిలోని.. ఊటుకూరు పరిధిలో అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకుని రూరల్ సీఐ కి అప్పగించడం జరిగిందన్నారు. అలాగే.. రెండవరోజు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో అన్యాక్రాంతం అయిన 49 ఎకరాల ప్రభుత్వ భూమిని.. ఆక్రమణ దారుల నుండి.. తొలగించి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.డ్రైవ్ లో భాగంగా.. చట్ట విరుద్ధంగా ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడిన వారిపై, ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు నిర్వహించిన వారిపై.. అమలులో ఉన్న నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా.. చట్ట విరుద్ధ చర్యలకు వినియోగిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని.. సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Special drive for removal of encroachments