పీఎస్ఎల్వి సి-52 నమూనాకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

తిరుమలముచ్చట్లు:
 
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఇస్రో సైంటిస్ట్ బృందం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఇస్రో సైంటిస్ట్ బృందం సభ్యులు పాల్గొని మొక్కులు
చెల్లించుకున్నారు. 14వ తేది పీఎస్ఎల్వి సి-52 లాంచింగ్ చేయనున్న నేపథ్యంలో సి-52 నమూనాను  శ్రీవారి మూలవిరాట్ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల
మండపంలో వేద పండితులు సి-52 నమూనాకు వేదాశీర్వచనం చేసారు. ఆలయ అధికారులు ఇస్రో సైంటిస్ట్ బృందానికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు..
 
Tags: Special pujas for PSLV C-52 model at Srivari Temple

Natyam ad