నేషనల్ పాలిటిక్స్ లో స్పీడ్  

హైదరాబాద్ ముచ్చట్లు:

జాతీయ రాజకీయాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల ద్వారా నేషనల్ పాలిటిక్స్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకునే ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో రాష్ట్ర కోటా కింద మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు వేరు వేరు తేదీల్లో జరగనున్నాయి. ఈ స్థానాలకు పార్టీలో సీనియర్లు, అసంతృప్తులు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని రాజ్యసభ సీటు ఇస్తారని ఇన్నాళ్లు అంతా భావించినా.. కేసీఆర్ మదిలో మాత్రం మరో ఆలోచన ఉందనే ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని రూపొందించే క్రమంలో తమ వాణిబాణిని బలంగా వినిపించగలిగే భాషా సామర్థ్యం ఉన్న అభ్యర్థులను కేసీఆర్ వెతికే పనిలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.నేషనల్ పాలిటిక్స్ లో సత్తాచాటాలంటే హిందీ, ఇంగ్లీష్ తప్పని సరి. అయితే ఇంగ్లీష్ రాకపోయినా హిందీలో మేనేజ్ చేద్దామనుకుంటే తెలంగాణ హిందీలో ఉర్దూ పదాల వాడకం అధికంగా ఉంటుంది. అందువల్ల నార్త్ ఇండియన్స్ అర్థం చేసుకోగలిగే భాషా పరిజ్ఞానం అవసరం అని కేసీఆర్ భావిస్తున్నారట.

 

అనర్గళంగా మాట్లాడగలిగే కేసీఆర్ సైతం ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన రైతు నిరసన సభలో హిందీ విషయంలో తడబడ్డారనే విమర్శ వచ్చింది. వీటన్నింటికి చెక్ పెట్టేలా అభ్యర్థుల ఎంపిక ఉండాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.ఇందు కోసం తెలుగు, ఇంగ్లీష్ తో పాటు హిందీ భాషా పరిజ్ఞానం గల మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఇతర ప్రముఖ నేతల పేర్లు ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నట్లు పొలిటికల్ కారిడార్ లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం వీరిలో నుండి మే 17 లేదా 18వ తేదీన ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మారుతున్న రాజకీయ ప్రాధాన్యతల దృష్ట్యా రాజ్యసభ సీట్లు ఎవరికి దక్కనున్నాయనే అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోందట. లెక్కలను బట్టి చూస్తే టీఆర్ఎస్ ఈ మూడు సీట్లను కైవసం చేసుకోవడం ఖాయమే. మరి భాషా పరిజ్ఞానం అంశం ఆధారంగా ఎవరి టికెట్ చేజారిపోతుందో అన్న టెన్షన్ ఆశావాహుల్లో నెలకొందట. మరి చూడాలి కేసీఆర్ పెట్టబోయే లాంగ్వేజ్ టెస్ట్ లో ఎవరు పాసవుతారో!.

 

Post Midle

Tags: Speed in National Politics

Post Midle
Natyam ad