పుంగనూరులో వైభవంగా శ్రీ అగస్తీశ్వరస్వామి తిరుణాళ్లు
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని నెక్కుంది కొండలపై వెలసిన శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి తిరుణాళ్లు వైభవంగా జరిగాయి. గురువారం ఉత్సవాలలో మూడవ రోజు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, కొండపై ఊరేగింపు నిర్వహించారు. స్వామివారి రథంపై ఉప్పు, మిరియాలు, బొరుగులు, నవదాన్యాలు చల్లి భక్తులు వెహోక్కులు చెల్లించుకున్నారు. శివనామస్మరణతో అగస్తీశ్వరాలయం మారుమ్రోగింది. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు, చౌడేపల్లె నుంచి రెండు బస్సులు నిత్యం భక్తులను చేరవేయడంతో కొండ క్రికిరిసిపోయింది. సుమారు రూ.10 కోట్లతో మంత్రి పెద్దిరెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. తారు, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags; Sri Agastheeswaraswamy feasts in glory at Punganur