పూలంగి సేవలో కొలువుతీరిన శ్రీ వీరాంజనేయ స్వామి

రామసముద్రం ముచ్చట్లు:

మండలంలోని కుదురుచీమనపల్లి పంచాయతీ వై. కుర్రప్పల్లిలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం మాఘ మాస పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలను ఆలయ అర్చకులు కె. లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి అభిషేకం, సహస్రనామార్చన కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారికి అత్యంత ప్రీతిపదమైన పూలంగి సేవలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పుంగనూరు రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో వెలసిన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం వేకువజాము నుంచి శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి, సత్యనారాయణస్వామి, గూడూరుపల్లె వద్ద గల శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం, దత్తాత్రేయస్వామి ఆలయాల్లో అభిషేకాలు , హోమాలు నిర్వహించారు. అలాగే పలు ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్వామివార్లను, ఆలయాలను పూలతో , విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు ఉపవాస దీక్షలతో మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థప్రసాదాలు తీసుకుని దీక్షలు విరమించారు.

Tags: Sri Veeranjaneya Swami who was measured in the Poolangi service

Natyam ad