శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం,

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:
మంగళవారము మాఘ శుద్ధ సప్తమి “రథసప్తమి” సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం రుద్ర పాదాల దగ్గర గల శ్రీ ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఉదయం 7.00 గంటలకు కలశం ఉంచి స్వామి వారికి సంకల్పం చేసి ప్రత్యేకముగా అభిషేకం, ధూప దీప నైవేద్యాలు సమర్పించడం జరిగినది. సదరు కార్యక్రమం నందు ఈవో శ్రీ పెద్ది రాజు గారు దంపతులు,శ్రీకాళహస్తి శాసన సభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు కుమారుడు శ్రీ బియ్యపు ఆకర్ష రెడ్డి గారు, డిప్యూటీ ఈవో కృష్ణా రెడ్డి గారు, పర్యవేక్షకులు విజయసారథి, ఉప ప్రధాన అర్చకులు శ్రీ కరుణాకర్ గురుకుల్, పురోహిత్ శ్రీ అర్ధగిరి స్వామి, వేదపండితులు భక్తులు మీడియా మిత్రులు మరియు సిబ్బంది, పుర ప్రజలు covid 19 నిబంధనలకు లోబడి పాల్గొన్నారు.తదనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల రెండవ కాలం అభిషేకం ముగిసిన పిమ్మట అలంకార మండపం నుండి శ్రీ స్వామివారు సూర్యప్రభ వాహనంపై, శ్రీ అమ్మవారు చప్పరం వాహనముపై నాలుగు మాడ వీధుల్లో గ్రామోత్సవం వెళ్లి భక్తులకు దర్శనం ఇచ్చి తిరిగి అలంకార మండపమునకు తీసుకురావడమైనది.
 
Tags: Srikalahastishwara Swamy Temple,

Natyam ad