వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులుగా శ్రీనివాస్

జగిత్యాల ముచ్చట్లు:
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా లంక దాసరి శ్రీనివాస్, జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షులుగా అస్ఘర్ ఖాన్ లను నియమిస్తూ ఆ సంఘం జాతీయ అద్యక్షులు మున్నా, రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగరావులు గురువారం నియామక పత్రాలను అందజేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు నూతన అధ్యక్షులను శాలువాతో సత్కరించి నియామక  పత్రాలను అందించారు. అనంతరం లంకదాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని వికలాంగుల హక్కులు, సంక్షేమ సాధన కోసం కృషిచేస్తామని అన్నారు. తమ నియామకానికి సహకరించిన కేంద్ర, రాష్ట్ర కమిటీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అద్యక్షులు మున్నా మాట్లాడుతూ మార్చి 28 న వికలాంగుల సమస్యలపై తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వ వికలాంగ పింఛన్ 3 వందల నుంచి 3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. వికలాంగుల చలో ఢిల్లీ కార్యక్రమానికి జిల్లాలోని వికలాంగులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ లోసాని నర్సింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్నం శ్రీనివాస్ లు ఉన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:Srinivas as the District President of the National Forum for the Rights of Persons with Disabilities

Natyam ad