శుచికి శుభ్రతకు SSS హోమ్లీ ఫుడ్స్

తిరుపతి  ముచ్చట్లు:
 
స్థానిక రెడ్డి & రెడ్డి కాలనీ లోని SSS హోమ్లీ ఫుడ్స్ ను నగరపాలక డిప్యూటీ మేయర్  భూమన అభినయ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు . ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అభినయ కి డాక్టర్ సుధారాణి , సుకుమార్ లు పుష్ప గుచంతో స్వాగతం పలికి ఆహ్వానించారు , అనంతరం కిచెన్ హాల్ ను సందర్శించి పరికరాల నాణ్యతపై అధినేతలు డాక్టర్ సుకుమార్ , డాక్టర్ సుధారాణి లను అభినందించారు . సామాన్య ప్రజలకు అందుబాటులో తక్కువ ధరలతో నాణ్యమైన భోజనం అందించాలని కోరారు .
డాక్టర్ సుకుమార్ , సుధారాణి లు మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా సామాన్య ప్రజలకు శుచి ,రుచికరమైన భోజనము అందించాలనే ఉద్దేశంతో , SSS హోమ్లీ ఫుడ్స్ ను ప్రారంభించామని చెప్పారు . ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తిరుత్తని శైలజ వేణు గోపాల్ , డొద్దారెడ్డి సిద్దారెడ్డి , శేఖర్ రెడ్డి , mvs మణి , డాక్టర్లు బలరామరాజు , సిపాయి సుబ్రమణ్యం, శ్రీహరి రావు , కృష్ణప్రశాంతి, వికాస్ , ఎల్ ఆర్ నాయుడు , శ్రీకృష్ణ ,జగదీష్ ,దినేష్ , భాస్కర్ నాయుడు సునీల్ మరియు సాయి సుధా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు .
 
Tags: SSS Homely Foods for Hygiene Cleanliness

Natyam ad