Start the village

గ్రామదర్శిని ప్రారంభం

Date:16/07/2018

పుంగనూరు ముచ్చటు

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను తెలుసుకునే గ్రామదర్శిని కార్యక్రమాన్ని సోమవారం పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీలో ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెంకటరమణరాజు , కన్వీనర్‌ శ్రీనాథరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణరాజు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ప్రాంతంలోను పర్యటించి, ప్రజల సమస్యలను గుర్తిస్తామన్నారు. గృహాలు, మంచినీటి సమస్య, రేషన్‌కార్డులు, పెన్షన్లు తదితరు సమస్యలను సేకరించి, వాటిని కంప్యూటర్‌లో నమోదు చేస్తామన్నారు. దీనిని అధికారులకు పంపి, సత్వరం పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేద ప్రజల అవసరాలను గుర్తించి, పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

గ్రామదర్శిని ప్రారంభంhttp://www.telugumuchatlu.com/start-the-village/

Tags; Start the village

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *