ప్రారంభమయిన పోలింగ్

Date:07/12/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా  పోలింగ్ కొనసాగుతోంది. సిద్దిపేట్ జిల్లా సిద్దిపేట పట్టణంలో రతెరాస అభ్యర్ది హరీష్ రావు తన భార్య శ్రీనితతో పాటు ఓటు హక్కు వినియోగించుకున్నారు.  గజ్వేల్ పట్టణంలోని మోడల్ పోలింగ్ స్టేషనులో మాక్ పోలింగ్ లో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పాల్గన్నారు.

 

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ లో టిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర  మండలకేంద్రంలోని 199 బూత్ లో గంటపాటు ఈవిఎంలు మొరాయించాయి.సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో బిజెపి అభ్యర్థి పట్లోళ్ల సంజీవరెడ్డి 176 పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని నెహ్రూ నగర్ పోలింగ్ కేంద్రంలో ప్రజా కూటమి అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని పేరుకవాడ లొ పోలింగ్ బూత్ (121) లో తెరాస అభ్యర్థి నన్నపనేని నరేందర్ ఓటు వేసారు.

 

 

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గొల్లగూడెం లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం  రంగరాజపురం లొని బుత్  నెంబర్ 27,34,35 ఉన్న ఈవియం మొరాయించడంతో గంటన్నర సేపు ఓటింగ్ ఆగిపోయింది. భద్రాచలం లో అరగంట లేటుగా పోలింగ్ ప్రారంభమయింది.

సుభాష్ ఘాయ్ కు క్లీన్ చిట్

Tags: Starting polling

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *