సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందంజ -మంత్రి కేటీఆర్

హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాల్లో దేశంలో ముందంజలో ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో వైకుంఠధామం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మల్లాపూర్ డివిజన్ లో వైకుంఠధామం పార్కును తలపిస్తుంది, ఇలాంటి వైకుంఠ దామాలు ఉప్పల్ నియోజకవర్గం లో  ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7300 కోట్ల వ్యయంతో హైదరాబాద్ రూపురేఖలు మార్చామని, అలాగే హైదరాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా 1000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు శంకుస్థాపన చేశామని అని తెలియజేశారు.జూన్ నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం. మన బస్తీ మన బడి కింద ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ఈ జూన్ నుంచే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని చెప్పారు. హైదరాబాద్కు నలుమూలాల వెయ్యి పడకల ఆస్పత్రులను నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. పేదలకు అవసరమైన విద్య, వైద్య, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు.
జాగ ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ. 3 లక్షలు ఇస్తామన్నారు. ఈ ఏడేండ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. అన్ని వర్గాలకు, కులం, మతం అనే పంచాయితీ లేకుండా నిధులు కేటాయిస్తున్నాం. వచ్చే నెలలో చర్లపల్లిలో ఆర్యూబీ పూర్తి చేసి ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు.
 
Tags:State leads in implementation of welfare schemes – Minister KTR

Natyam ad