Stay tidy with ... ...

ఎప్పటికీ టీడీపీతోనే ఉంటా… -బోసు స్పష్టీకరణ

Date : 29/12/2017

పలమనేరుముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి తాను తెదేపాలో ఉన్నానని, ఎప్పటికీ ఆ పార్టీతోనే ఉంటానని రాష్ట్ర టీడీపీ కోశాధికారి ఆర్వీ.సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఇటీవల ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన ‘ బోసూ… ఏది నీ ప్లేసూ…’ అనే వార్తపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి వార్తలు ఎవరు సృష్టిస్తారో,ఎందుకు సృష్టిస్తారో తనకు అర్థం కావడం లేదన్నారు. సామాజిక మాద్యమాలైన వాట్సాప్ లాంటి అప్లికేషన్ల ద్వారా తప్పుడు కథనాలను కల్పించి కట్టు కథలు అల్లుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏవో వ్యక్తిగత సమస్యల కారణంగా పార్టీ నిర్వహించే సమావేశాలకు రాలేకపోయినంత మాత్రాన తనను సంప్రదించకుండా తన ప్రతిష్టకు భంగం కలిగించేవిధంగా వార్తలు రాయడమేంటని ఆయన ప్రశ్నించారు. తాను టీడీపీ పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని అందులో ఎంతమాత్రమూ నిజం లేదని ఆయన ఉద్ఘాటించారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాస్తే మంచిదని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరి, ఆర్బిసి కుట్టి, కిరణ్ రాయల్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags : Stay tidy with … …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *