Steve Smith australia england

స్టీవ్‌ స్మిత్‌…టాంపరింగ్‌ వివాదం

సాక్షి

Date :22/01/2018

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్‌ సారథి స్టీవ్‌ స్మిత్‌ బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో  చిక్కుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో స్మిత్‌ బంతిని టాంపరింగ్‌ చేస్తూ దొరికిపోయాడు. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేసే సమయంలో బంతి అందుకున్న స్మిత్‌ తన పెదవులకు ఉన్న లిప్‌ బామ్‌ను బంతికి పూశాడు. ఇది వీడియోలో రికార్డు కావడంతో స్మిత్‌పై విశ్లేషకులు మండిపడుతున్నారు. అయితే మ్యాచ్‌ తర్వాత నిర్వహించిన పోస్ట్‌ కాన్ఫరెన్స్‌లో స్మిత్‌ మాట్లాడుతూ.. తాను ఏ తప్పూ చేయలేదని వాదిస్తున్నాడు.

‘అలాంటిదేమీ లేదు. నా పెదవులకు ఉన్న లిప్‌బామ్‌ను బంతికి రాసినట్లు పలువురు నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఒకసారి వీడియోను పరిశీలిస్తే నా పెదవులపై లిప్‌ బామ్‌ లేదన్న విషయం తెలుస్తుంది’ అని స్మిత్‌ పేర‍్కొన్నాడు. ఇదిలా ఉంచితే, మూడో వన్డేలో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా స్మిత్‌ మ్యాచ్‌ ఫీజులో 40 శాతం కోత పడింది. మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 0-3తో కోల్పోయిన సంగతి తెలిసిందే. మూడో వన్డేలో ఆస్ట్రేలియా 16 పరుగుల తేడాతో ఓటమి చవిచూసి సిరీస్‌ను ఇంకా రెండు వన్డేలు ఉండగానే చేజార్చుకుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *