వ్యూహాం మార్చిన వైసీపీ

Date:15/03/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రత్యేక హోదాపై పోరును ఉధృతం చేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. అవిశ్వాసం విషయంలో స్పీడ్ పెంచాలని భావిస్తున్న ఎంపీలు… సడన్‌గా వ్యూహాన్ని మార్చారు. పార్లమెంట్‌ త్వరగా ముగిస్తారనడంతో… రేపే కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించినట్లు సమాచారం. అవిశ్వాసానికి మద్దతు కూడగట్టడంపై కూడా ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. తీర్మానానికి మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలకు లేఖలు రాయాలని భావిస్తున్నారు. అన్ని పార్టీలతో పాటూ టీడీపికి కూడా లేఖను పంపాలనే ఆలోచనలో ఉన్నారట.
అలాగే రాజీనామాల విషయంలో కూడా ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ నిరవధిక వాయిదా పడే రోజే ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి 23ను అవిశ్వాసం పెట్టాలని భావించారు. కాని మారిన పరిస్థితులతో వైసీపీ వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. మరి వైసీపీ అవిశ్వాసం పెడితే… పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిగా మారింది. టీడీపీకి వైసీపీ లేఖ రాస్తే… ఆ పార్టీ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది అన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది.
Tags: Strategy Changed VCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *