Structured equipment with repairs in the MGM

ఎంజీఎంలో మరమ్మతులతో మూలనపడ్డ పరికరాలు

Date: 03/01/2018

వరంగల్‌ ముచ్చట్లు:

ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్‌లో ఉన్న ఎంజీఎం ప్రభుత్వాసుపత్రి. ఈ ఆసుపత్రిలో మూడు ల్యాబ్‌లు ఉన్నాయి. అయినా అన్ని రకాల పరీక్షలు ఇక్కడ నిర్వహించరు. కొన్ని పరీక్షలను మాత్రమే చేస్తారు. మిగతావన్నీ ప్రైవేటులో చేయించుకోండని ఇక్కడి వైద్యులు సూచిస్తున్నారు. కారణం ల్యాబ్‌లో పనిచేసే పరికరాలు మూలకుపడిపోవడమే. ఇది రోగులకు తీవ్ర శాపంగా మారుతోంది. ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న సిటీ స్కానింగ్‌, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ యంత్రాలు మూలకుపడ్డాయి. ఈ బాధ్యతను ప్రైవేట్‌ సంస్ధకు అప్పగించారు. అయితే అసుపత్రిలో అడ్మిటైన రోగికైతే ఉచితంగా స్కానింగ్‌ చేస్తున్నారు. అదే ఓపి విభాగానికి వచ్చే రోగుల నుంచి మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక మూత్రపిండాలు పనిచేయని వారికి రక్తాన్ని శుద్ది చేసేందుకు డయాలసిస్‌ను సైతం ప్రైవేటు సంస్ధకే అప్పగించారు. ఆరోగ్య శ్రీ రోగులకు మాత్రమే డయాలసిస్‌ చేస్తున్నారు. అత్యవసర విభాగం వద్ద ఉన్న ఎక్స్‌రే పరికరం రిపేర్లతో మూలనపడటంతో రోదులు ఓపిలో పనిచేసే ఎక్స్‌రే విభాగానికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచసిన డాక్టర్ రాజయ్య ఎంజిఎంలో ఒక రోజు మొత్తం ఉండి అక్కడే నిద్ర చేశారు. అయినా ఎలాంటి సౌకర్యాలు మెరుగుపడలేదు. ఇప్పటికైనా సర్కార్‌ స్పందించి ఎంజిఎంలోని ల్యాబ్‌లన్నీ అందుబాటులోకి తీసుకురావాలని ఇక్కడి రోగులు కోరుతున్నారు.

Tags: Structured equipment with repairs in the MGM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *