జీన్స్‌తో వచ్చిన విద్యార్థి తొడలు కోసిన టీచర్..

లక్నో ముచ్చట్లు :

స్కూల్ యూనిఫాం వేసుకురాలేదని టీచర్లు ఓ విద్యార్థి తొడలు కోసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్, సికందర్ నగర సమీపంలోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. 11వ తరగతి చదువుతన్న విద్యార్థి రోజు మాదిరి స్కూల్ యునిఫాం కాకుండా జీన్స్ ధరించి శనివారం పాఠశాలకు వెళ్లాడు.దీంతో ఆగ్రహానికి గురైన స్కూల్ మేనేజర్ ప్యాంట్‌ను కత్తిరించాలని టీచర్లకు సూచించాడు. దీంతో ఓ టీచర్ ఆ విద్యార్థి ప్యాంట్‌ను తొడలపై భాగం వరకు కత్తిరించే సమయంలో విద్యార్థి తొడలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి తండ్రి స్కూల్ యాజమాన్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇంటికి పంపించి స్కూల్ యునిఫాం వేసుకురావలని సూచించకుండా.. ఇంత దాష్టికంగా ప్రవర్తించారని మండిపడ్డారు.

Tag : Student thighs teacher with jeans


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *