పుంగనూరులో విద్యార్థులు నైపుణ్యాలను గుర్తించాలి

పుంగనూరు ముచ్చట్లు:
 
విద్యార్థులు వారి మనోభావాలను పట్టి జీవితంలో స్థిరపడేందుకు మార్గాలు ఎంచుకోవాలని రీసోర్స్పర్శన్‌ అమరనాథ్‌ సూచించారు. శనివారం మండలంలోని గూడూరుపల్లె హైస్కూల్‌లో హెచ్‌ఎం మహేష్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు కేరీర్‌ గైడేన్స్, లైఫ్‌స్కిల్స్పై అవగాహన సదస్సును నిర్వహించారు. అమరనాథ్‌ మాట్లాడుతూ విద్యార్థులు తమకు ఇష్టమైన చదువును ఎంచుకోవాలన్నారు. ఒత్తిళ్లకు, ఇతరులను చూసి నచ్చని వాటిని ఎంచుకోవడం , అర్ధాంతరంగా ఆగిపోవడం చేయవద్దన్నారు. ఏ కోర్సులో తమకు ఇష్టంగా ఉంటుందో వాటిని చదువుకుని, అందుకు తగ్గట్టుగా స్థిరపడ్డాలన్నారు. జీవన ప్రగతికి నైపుణ్యం అవసరమన్నారు. అలాంటి వాటిని గుర్తించడమే విద్యార్థుల ప్రధమ కర్తవ్యమని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వీటిపై వ్యాసరచన, వక్తత్వ పోటీలు నిర్వహించి, బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణ, రఘు, రాజేష్‌, నారాయణ, మునిరాజ, విజయవాణి, శైలజరాణి, శారద, సురేష్‌, ప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 
Tags;Students in Punganur need to identify skills

Natyam ad