ఉక్రేయిన్ లో ప్రాణాలు కోల్పోతున్న విద్యార్ధులు

కేంద్ర చర్యలకోసం తల్లిదండ్రుల అందోళన
 
తిరుపతి ముచ్చట్లు:
 
ఉక్రెయిన్ లో కొనసాగుతున్న విద్వంసక చర్యల్లో విద్యార్ధులు ప్రాణాలు కోల్పోవడంపై తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు.చదువు కోసం విదేశాల బాట పట్టిన విద్యార్ధులు యుద్ద వాతావరణంలో చిక్కుకొని పడుతున్న అవస్ధల నుంచి బయట పడే విదంగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించాలని కోరుతూ తిరుపతిలో తల్లితండ్రులు రోడెక్కి ఆందోళనకు దిగారు.కర్ణాటకకు చెందిన విద్యార్ధి రష్యా యుద్దంలో ప్రాణాలు కొల్సోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.ఉక్రెయిన్ తో పాటుగా సమీప వర్శిటీలో చదువుతున్న విద్యార్ధులను కూడా భారత దేశానికి తీసుకొచ్చేందుకు కేంధ్ర ప్రభుత్వం దృష్టి సారించాలని తల్లితండ్రుల కోరుతున్నారు.రష్యా ప్రతీకర చర్యల్లో విద్యార్ధుల ప్రాణాలకు ముప్పు లేకుండా ఉండేలా ప్రభుత్వం సహాయాన్ని అందించాలని విజ్నప్తి చేశారు.
 
Tags: Students losing their lives in Ukraine

Natyam ad