ఈతకు వెళ్లిన విద్యార్ధులు మృతి

ఒంగోలు   ముచ్చట్లు:
ఈతకువెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఈ ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం.నిడమానూరులో నెలకొంది. వాసు(15), జగన్ (12), మహేశ్ (13) లు నిడమానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఆదివారం స్కూల్ కి సెలవు కావడంతో మధ్యాహ్నం వేళ క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. గ్రామ శివారులోని వాగులో స్నానం చేద్దామని దిగారు. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పిల్లల్ని వాగువద్ద చూసినట్లు ఎవరో చెప్పగా.. అక్కడికి వెళ్లి చూశారు. అయినా పిల్లలు కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. గజఈతగాళ్లతో వాగులో గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం  ఉదయం ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. విద్యార్థుల మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 
Tags:Students who went swimming died

Natyam ad