శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 1న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఇందులో భాగంగా ఆలయంలో ఉదయం 6 గంటలకు శ్రీ గోవిందరాజ స్వామివారు,  ఆండాళ్‌ అమ్మవారు,  విష్వ‌క్సేనుల‌వారు, రామానుజాచార్యులు,  న‌మ్మాళ్వార్‌,  కూర‌త్తాళ్వార్‌,  తిరుమంగైయాళ్వార్ ఉత్సవమూర్తులకు తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో  రాజేంద్రుడు, ఏఈవో  రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు  నారాయ‌ణ‌,  వెంక‌టాద్రి టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు  కామ‌రాజు,  ధనంజయుడు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.
 
Tags: Study festivities ending at Sri Govindarajaswamy Temple

Natyam ad