Success in the 27th Annandpurary of the tribal conquest

ఈనెల 27 అనంతపురంలో జరిగే గిరిజన శంఖారావాన్ని విజయవంతం చేయండి

Date:15/01/2018


– వాదిత్యశంకర్‌నాయక్‌

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లాలో ఈనెల 27న జరగనున్న గిరిజన శంఖారావం సభకు ప్రతి ఒక్కరు హాజరై, విజయవంతం చేయాలని సంఘ అధ్యక్షుడు వాదిత్యశంకర్‌నాయక్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాలలోని గిరిజన తాండాలలో ప్రచారం చేసి , కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ గిరిజన తాండాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు తాడాలలోని గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు శంఖారావాన్ని నిర్వహిస్తున్నామన్నారు. హక్కుల సాధన కోసం గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా శంఖారావం రథం ప్రారంభమైందని, ఈ సభను విజయవంతం చేసేందుకు వేలాదిగా గిరిజనులు తరలిరావాలని కోరారు.

Tags : Success in the 27th Annandpurary of the tribal conquest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *