కలహాలతో భర్త ఆత్మహత్యాయత్నం

Date:11/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

కుటుంబ కలహాలతో భర్త శరీరంపై కిరోసిన్‌ పోసుకుని కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం సాయంత్రం పట్టణంలోని ఉబేదుల్లాకాంపౌండులో జరిగింది. అబ్దుల్‌ రఫీక్‌ కుమారుడు ఆసిఫ్‌ (25) వ్యాపారం చేసి జీవించేవాడు. ఇతనికి ఆరు సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన అఖిలతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఇలా ఉండగా అంఖిల పుట్టినింటిని వెళ్లిపోయింది. ఆమె రాకపోవడంతో పలుమార్లు భార్య వద్దకు వెళ్లి వచ్చాడు. ఫలితం లేకపోవడంతో మనస్థాపానికి గురై, ఇంటిలో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు మంటలను ఆర్పి , బాధితున్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శరీరం పూర్తిగా కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

13న డీఎస్సీ నమూనా పరీక్షలు

 

Tags: Suicide with suicide is a suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *