చిన్న జిల్లాలకు అనుకూలం -బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు

విశాఖపట్నం ముచ్చట్లు:
 
కొత్త జిల్లాలో ఏప్రాంతాలు కలవాలి, ఏ నగరం ముఖ్యపట్టణంగా ఉండాలి, పేరు ఏం పెట్టాలి వంటివి తేల్చడానికి ప్రజాభిప్రాయ సేకరణకు కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. పాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాల ఏర్పాటు బిజెపి జాతీయ విధానం. ఏపిలో కూడా 25 జిల్లాలు చేస్తామని ఎప్పుడో 2014
మేనిఫెస్టోలోనే ప్రకటించాం. మేము పార్టీ పరంగా పార్లమెంటు జిల్లాలనే కార్యకలాపాలకు ఎంచుకున్నాం. కనుక జగన్ సర్కారు తీసుకున్న జిల్లాల ఏర్పాటును మేము స్వాగతిస్తున్నాం.  ప్రజాభిప్రాయం అంటే
ఓట్లేనని, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వారిదే రాజ్యాంగమనీ జగన్ వ్యాఖ్యానించటం సరికాదు. ఎన్నికల్లో విజయం కంటే రాజ్యాంగం సమున్నతమైనది. ప్రజలు గెలిపించారు కనుక తామన్నదే రాజ్యాంగం
అనటం ఒప్పుకోం.  గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చాలి. అబ్దుల్ కలామ్ టవర్ అని పేరు పెట్టాలి. బ్రిటిష్ రాజుల పేర్లు కూడా మార్చాలి. కెజిహెచ్, జిజిహెచ్ లకు స్థానిక నేతల పేర్లు పెట్టాలి. గౌతు
లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం వంటివారికి గౌరవం ఇవ్వాలని అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బిజెపి మీద ఆరోపణలు చేస్తున్నారు. బిజెపి మతతత్వ ఉద్యమాలు చేసిందంటున్నారు. మరి మీరు రామతీర్థంలో రాముని శిరస్సు ఖండించిన వారిని ఏమి చేశారు? రధాలు దగ్ధంచేసిందెవరో ఎందుకు కనిపెట్టి పట్టుకోలేదు. మీరు హిందూ అనుకూలురా? వ్యతిరేకులా? తేల్చి చెప్పండి వెల్లంపల్లిగారూ! జగన్ ప్రజల్ని కన్న బిడ్డల్లా  చూసుకుంటున్నారా? మరి హిందువులు ప్రజలుకారా? వారి మనోభావాలు దెబ్బతీయటం తప్పుకాదా అని నిలదీసారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Suitable for small districts -BJP AP president Somu Weeraju

Natyam ad