Sunil Kumar, a Vaikappa MLA who distributes clothes to the poor as a Christmas gift

క్రిస్మస్ కానుకగా పేదలకు బట్టలు పంపిణీ చేసిన వైకాపా ఎమ్మెల్యే సునీల్ కుమార్

Date : 23/12/2017
పూతలపట్టు ముచ్చట్లు:
 క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్  పేదలకు ఉచితంగా బట్టలు పంపిణీ చేశారు. ఐరాల మండలంలోని వైఎస్ గేటు వద్ద గల చర్చిలో జీసస్ కు ప్రార్థనలు నిర్వహించి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు తిరుపతికి చేరుకుని జిల్లా వైసీపీ ఇన్చార్జి, వైసీపీ అధికార ప్రతినిధి అయిన  విజయ సాయిరెడ్డిని కలిసారు.ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ వైసీపీ కో-ఆర్డినేటర్ రాకేష్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుమార్ రాజా, నాయకులు శరత్ చంద్రారెడ్డి, చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags : Sunil Kumar, a Vaikappa MLA who distributes clothes to the poor as a Christmas gift

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *