Support for Jamali Policy: Lokesh

జమిలి విధానానికి మద్దతివ్వం: లోకేశ్‌

Date:16/07/2018

గుంటూరు ముచ్చట్లు:

జమిలి విధానానికి మద్దతివ్వం: లోకేశ్‌ గుంటూరు: యువత ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. గుంటూరు ఎస్‌ఆర్‌ఎం వర్శిటీలో ‘ఇంజినీరింగ్‌ విద్యలో సంస్కరణలు- భవిష్యత్‌ నైపుణ్యాలు’ అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏటా డిగ్రీలు పట్టుకుని బయటకు వస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో 15శాతం మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. ఇంజినీరింగ్‌ యువత తమ నైపుణ్యాలను ఎప్పటికప్పడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఏపీ కొన్నేళ్లుగా రెండంకెల వృద్ధిరేటుతో స్థిరమైన ప్రగతి సాధిస్తోందన్నారు.సాంకేతిక వినియోగంలో ఏపీ అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉందన్నారు. ఇంజినీరింగ్‌లోనే కాకుండా అన్ని రంగాల్లోనూ హాకథాన్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలోగా రాజధానిలో రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వచ్చే రెండు నెలల్లో రాష్ట్రానికి మరిన్ని ఐటీ సంస్థలు రానున్నట్లు చెప్పారు.ఐటీ కంపెనీల అనుమతుల్లో ఎక్కడా అవినీతి జరగలేదన్నారు. భూముల కేటాయింపు, మౌలిక వసతుల కల్పనలో పారదర్శకత పాటిస్తున్నట్లు లోకేశ్‌ తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని సవాల్‌ చేసినా ఎవరూ ముందుకు రాలేదన్నారు. జమిలి ఎన్నికలకు తెదేపా వ్యతిరేకమని.ఈ విధానానికి మద్దతు ఇవ్వబోమని లోకేశ్ స్పష్టం చేశారు. అవిశ్వాసంపై తెదేపా ఏం చేస్తుందో త్వరలోనే చూస్తారని పేర్కొన్నారు.

జమిలి విధానానికి మద్దతివ్వం: లోకేశ్‌http://www.telugumuchatlu.com/support-for-jamali-policy-lokesh/

Tags: Support for Jamali Policy: Lokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *