ఇద్దరూ టీచర్లపై సస్పెన్షన్

విజయనగరం ముచ్చట్లు:
 
ఏపీలోని విజయనగరం ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దారుణ ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో చోటుచేసుకుంది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. బాలేసు ప్రాధమిక పాఠశాల ఘటనలో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయులపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు స్వామినాయుడు, ఉపాధ్యాయుడు సూర్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తక్షణమే విధులనుంచి తప్పించి విచారణ జరపాలని ఆదేశించారు. విచారణ తరువాత క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని మంత్రి సురేష్ సూచించారు.కాగా… ఈ ఘటనపై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు ఉపాధ్యాయులను కలెక్టర్‌ సస్పెండ్‌ చేసి శాఖ పరమైన చర్యలకు ఆదేశించారు. ఇద్దరు కీచక ఉపాధ్యాయులు చిన్నారుల శరీరాన్ని తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. అయితే.. బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు అధికారులకు చేశారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఘటనా స్థలానికి వెళ్లి అధికారులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. తీవ్రంగా స్పందించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఇద్దరిని సస్పెండ్ చేశారు. అనంతరం వారిద్దరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కాగా.. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది.
 
Tags: Suspension on both teachers

Natyam ad