ఈనెల 27న సుస్థిర వ్యవసాయ రైతు చైతన్య సదస్సు

హైదరాబాద్    ముచ్చట్లు:
రసాయన క్రిమిసంహారకాలు వాడుతూ చేస్తున్న వ్యవసాయం వల్ల పుడమికి జరుగుతున్న నష్టం, సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం నిర్వహించడం ఎలా అనే అంశాలను రైతులకు వివరించేందుకు ఈనెల 27న వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి సుస్థిర వ్యవసాయ రైతు చైతన్య సదస్సు ను నిర్వహిస్తున్నట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమాజిగూడ  ప్రెస్ క్లబ్ లో  సదస్సుకుసంబంధించిన బ్రోచర్ ను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ రైతులకు వ్యవసాయ రంగంపై సంపూర్ణ చైతన్యం తీసుకు రావడమే లక్ష్యంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ పద్మావతి శ్రీనివాస గార్డెన్స్ లో సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం నిర్వహించడం, ప్రత్యామ్నాయ పంటలు, వ్యవసాయ అనుబంధ రంగాల నిర్వహణ, నూతన వ్యవసాయ సాగు పద్ధతులు అనే అంశాలపై సదస్సులో చర్చిస్తామని తెలిపారు. సదస్సులో భాగంగా ప్రకృతి వ్యవసాయ దారుల పంటల ప్రదర్శన,  ఉత్తమ రైతు దంపతులకు పుడమి పుత్ర పురస్కారాలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కిసాన్ సేవ రత్న అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు.
 
Tags:Sustainable Agriculture Farmer Awareness Conference on 27th of this month

Natyam ad