పొత్తు కుట్ర, అనైతికం : ఎంపీ కవిత

Date:19/09/2019
నిజామాబాద్ ముచ్చట్లు :
నిజామాబాద్ లో పోచమ్మ గల్లీ లో మట్టి గణపతి కి ఎంపీ కవిత బుధవారం పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మహాకూటమి ఒక దుష్ట చతుష్టయం. దుర్యోధనుడు దుశ్హాసనుడు కర్ణుడు శకుని ఈ పాత్రలు కూటమిలో ఎవరెవరు అనేది వారే తేల్చుకోవాలి.
తెలంగాణ మీద ప్రేమ లేని పార్టీలు కూటమిగా వస్తున్నాయని విమర్శించారు. ప్రజలు కుట్రలను తిప్పి కొడతారు. అభిషేక్ సింగ్వీ 70 లక్షలు ఓట్ల గల్లంతు అన్నారు. ఉత్తమ్ 20 లక్షలు అంటున్నారు ఇందులో ఏది సరైందో వారికే క్లారిటీ లేదని అన్నారు.
ఓట్ల వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుంది. అందులో కూడా కేసీఆర్ ఏమో చేశారంటే అర్థం ఉందా అని ప్రశ్నించారు. అయినా కాంగ్రెస్ పార్టీకి కోర్టులకు వెళ్ళడం, చివాట్లు పడటం అలవాటే. టీడీపీ,  కాంగ్రెస్ పొత్తు అనైతికం.
టీడీపీ కాంగ్రెస్ లు తెలంగాణ జనాలను పీడించాయి. అలాంటి పీడన పార్టీలతో తెలంగాణ జన సమితి కూడా మహాకూటమితో జట్టు కట్టడం హాస్యాస్పదమని కవిత అన్నారు.
Tags:Alliance conspiracy, unethical: MP poem