Natyam ad

ఓటిఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

రామసముద్రం ముచ్చట్లు:
 
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటిఎస్ పథకాన్ని అర్హత ఉన్న ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సచివాలయంలో ఓటిఎస్ లో జమ చేసిన రైతులకు రశీదులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ పథకం (ఓటిఎస్‌) రుణవిముక్తి శాశ్వత భూహక్కు బదలాయింపు పథకం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం 1983 నుండి 2011 మధ్య ప్రభుత్వ గృహాన్ని పొందిన లబ్ధిదారులను సర్వే ద్వారా గుర్తించి, వన్‌టైం సెటిల్మెంట్‌ (ఓటిఎస్‌) పథకానికి అర్హులను చేస్తూ, శాశ్విత రిజిస్ట్రేషన్‌ కొరకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వారి వద్దనుండి నగదును జమ చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ రోజు 21 మంది లబ్ధిదారులకు ఆన్‌ లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేశామన్నారు. పక్కాగహ లబ్ధిదారులు అందరూ వీలైనంత త్వరగా సచివాలయం వద్ద నగదు జమ చేసి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు. వీరికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ పత్రాలను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, డిజిటల్ అసిస్టెంట్ భారతి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మూర్తి తదితర సచివాలయ ఉద్యోగులు, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, సంఘమిత్రాలు మమత, సరిత, వాలింటర్లు మేఘన, రెడ్డెమ్మ, దినకర్, హరీష్ తదితర లబ్దిదారులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Take advantage of the OTS scheme- Sarpanch Srinivasureddy