Take advantage of the schemes: collector

పథకాలను సద్వినియోగం చేసుకోండి: కలెక్టరు

Date : 04/01/2018

కర్నూలు ముచ్చట్లు:

ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టరు ఎస్‌.సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం కోసిగి మండలం, వందగల్లు గ్రామంలో జరిగిన 5వ విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల వారీ సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను, వాటి లబ్దిని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైన వుందన్నారు. కుటుంబం, సమాజం బాగుపడాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమన్నారు. ఈ ప్రాంతంలో మాతా శిశు మరణాల సంఖ్య అధికంగా వుందని, చిన్న వయస్సులోనే వివాహాలు జరుగుతుండడమే ఇందుకు కారణమన్నారు. సరైన సమయంలో వివాహాలు చేసుకుంటే దీనిని అరికట్టవచ్చన్నారు. ఆరోగ్యం, విద్య ఎంతో ముఖ్యమని తెలిపారు. ఆరోగ్యం లేని సమాజం ముందుకు పోలేదన్నారు. వితంతువులు, వికలాంగులు, వృద్దులు తదితర అర్హులైన వారందరికీ ప్రభుత్వం పెన్షన్లను అందిస్తుందన్నారు. ప్రతి ఇంటికి గ్యాస్‌ కనెక్షన్‌, మంచి నీటి భద్రతను కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని మరుగుదొడ్డి ఉంటే రోగాలు దరిచేరవని, ఆత్మగౌరవానికి మరుగుదొడ్డి ప్రతీక అని అన్నారు. అర్హత కలిగిన వారందరూ చంద్రన్న బీమాలో తమ పేర్లను నమోదు చేయించకోవాలన్నారు. సాధికార మిత్రులు ప్రభుత్వమందిస్తున్న దాదాపు 42 సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎవరికైనా సమస్యలుంటే 1100 సమాచారాన్ని ఇచ్చి తమ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. చంద్రన్న పెళ్లి కానుకలో దారిద్య్ర రేఖకు దిగువనున్న ఎస్‌.టిలకు రూ. 50 వేలు, ఎస్‌.సిలకు రూ. 40 వేలు, బిసిలకు రూ. 35 వేల చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఈ ప్రాంతంలో 65 సీజనల్‌ వసతి గృహాలను ఏర్పాటుచేసామని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజకీయాలకతీతంగా జన్మభూమి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కుడా ఛైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రాభివృధ్దికి, సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎంతో కృషిచేస్తున్నారన్నారు. వీడియో కాన్పెరెన్స్‌, టెలి కాన్పరెన్స్‌ ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు వాటిని ముఖ్యమంత్రి పరిష్కరిస్తున్నారని తెలిపారు. అర్హత కలిగి వుండి పెన్షన్లు, రేషన్‌ కార్డులు రాని వారు తమ పేర్లను నమోదు చేసుకుంటే పరిశీలించి వాటిని అందిస్తామన్నారు. పరిసరాలు పరిశుభ్రంగావుంటే రోగాలు దరిచేరవన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అభివృధ్ది అధికారి, సెట్కూరు సిఇఓ సుధాకరరెడ్డి, నోడల్‌ అధికారి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags : Take advantage of the schemes: collector

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *